ప్రకటన 14- 19 అధ్యాయములలో అంత్య కాలములో జరగనున్న సంనివేషములు త్వరత్వరగా వివరించబడుతున్నవి. 19 అధ్యాయము చివరకు యేసు తన శత్రువులను అర్మగిద్దోను యుద్ధములో ఓడించుటకు రాజువలె తన ప్రజలతో వచ్చుట వ్రాయబడుతున్నది. భూమిపైనున్న ఆత్మీయ మరియు బౌతిక ఘోరమైన పరిస్థితి ప్రభు యేసు రెండవ రాకడతో అతమైపోవును. ప్రకటన గ్రంధ చివరి అధ్యాయములు అంత్యకాల చేడుగునకు వ్యతిరేకముగా క్రీస్తు రెండవ రాకడతో పునరుద్ధరించనై యున్న న్యాయమును మరియు నూతన సృష్టిని గురించి తెలియచేస్తున్నవి.